శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 10:42:18

వందేభార‌త్ మిష‌న్ కొన‌సాగుతుంది: విమాన‌యాన శాఖ

వందేభార‌త్ మిష‌న్ కొన‌సాగుతుంది: విమాన‌యాన శాఖ

న్యూఢిల్లీ: వ‌ందేభార‌త్ మిష‌న్ కొన‌సాగుతుంద‌ని కేంద్ర పౌర‌ విమానయాన శాఖ ప్ర‌క‌టించింది. క‌రోనా నేప‌థ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌కు స్వ‌దేశానికి త‌ర‌లించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం మే నెల‌లో వందేభార‌త్ మిష‌న్‌ను ప్రారంభించింది.  తాజాగా దుబాయ్ నుంచి 190 మంది ప్ర‌యాణికుల‌తో వ‌చ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కేర‌ళ‌ల‌లోని కోజికోడ్ విమాన‌శ్ర‌యంలో కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు పైల‌ట్లు స‌హా 18 మంది మ‌ర‌ణించారు. 

ఈ నేప‌థ్యంలో వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల త‌ర‌లింపు  కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు విడుత‌లు పూర్తికాగా, ప్ర‌స్తుతం ఐదో విడ‌త వందేభార‌త్ మిష‌న్ కొన‌సాగుతున్న‌ది. ఇందులో భాగంగా 9.5 ల‌క్ష‌ల మందిని స్వ‌దేశానికి త‌ర‌లించామ‌ని మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది. 


logo