ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 21:01:54

అర్మేనియా నుంచి బయలుదేరిన ‘వందేభారత్‌ మిషన్‌’ ఫ్లైట్‌

అర్మేనియా నుంచి బయలుదేరిన ‘వందేభారత్‌ మిషన్‌’ ఫ్లైట్‌

యెరెవాన్‌: వందేభారత్‌ మిషన్‌ కింద అర్మేనియా నుంచి ఎయిర్‌ ఇండియా విమానం భారత్‌కు బయలుదేరింది. కొవిడ్‌ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న 169 మందిని ఢిల్లీ, చెన్నైకి తరలిస్తున్నారు. ‘వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియన్‌ ఫ్లైట్‌ ఏఐ 1930 వైఈఆర్‌-డీఈఎల్‌-ఎంఏఏలో 169 మందిని తరలిస్తున్నాం. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.’ అని అర్మేనియాలోని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. 

గత నెలలో ప్రారంభించిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న 2,50,087 మందిని ఇండియాకు తరలించారు. ప్రస్తుతం వందే భారత్‌ మిషన్‌ మూడో ఫేస్‌ కొనసాగుతోంది. ఈ ఫేస్‌ను ఈ నెల 11 నుంచి ప్రారంభించారు. ఈ దశలో 550 విమానాల ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను ఇక్కడికి రప్పించనున్నారు. logo