ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 10:29:14

వైష్ణ‌వోదేవి యాత్ర డౌటే..

వైష్ణ‌వోదేవి యాత్ర డౌటే..

హైద‌రాబాద్‌: జ‌మ్మూలోని వైష్ణ‌వోదేవి యాత్ర‌కు మ‌ళ్లీ బ్రేక్ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఆగ‌స్టు 16వ తేదీన  వైష్ణ‌వోదేవి ఆల‌యాన్ని తెర‌వాల‌నుకున్నారు. కానీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. యాత్ర నిర్వ‌హ‌ణ మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. రీసి జిల్లాలోని త్రికూట ప‌ర్వ‌తాల్లో ఉన్న ఓ భ‌వ‌నంలో 11 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో వైష్ణ‌వోదేవి యాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మార్చి 18వ తేదీన ఆల‌యాన్ని మూసివేశారు. ప్ర‌తి రోజు 5 వేల మందిని మాత్ర‌మే అనుమ‌తించాల‌న్న నిబంధ‌న పెట్టారు. మ‌రో వైపు పంజాబ్ ఆరోగ్య‌శాఖ మంత్రి బ‌ల్బీర్ సింగ్ సిద్దూ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య‌శాఖ‌లో సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఎవ‌రికీ సెల‌వులు ఇవ్వ‌కూడ‌దంటూ ఆదేశాలు ఇచ్చారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. logo