ఆదివారం 31 మే 2020
National - May 19, 2020 , 21:04:47

కమ్యూనిటీ కిచెన్‌గా పోలీస్‌ స్టేషన్‌

కమ్యూనిటీ కిచెన్‌గా పోలీస్‌ స్టేషన్‌

వడోదర: నిబంధనలు పాటించని వారి పట్ల దయ చూపని పోలీసులు.. లాక్‌డౌన్‌ కారణంగా వారిలోని మానవత్వం బయటపడుతున్నది. నడుస్తూ సొంతూళ్లకు పోతున్న వలస కార్మికులకు భోజనం అందించి సాగనంపిన పోలీసులు.. పోలీస్‌ స్టేషన్‌నే ఏకంగా వంటశాలగా మార్చి వారి ఆకలి  తీరుస్తున్నారు. ఈ దృశ్యం గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకొన్నది. లాక్‌డౌన్‌తో వలస కూలీలు, దినసరి కార్మికులు ఆకలితో అలమటిస్తున్నది చూసి పోలీసులు కరిగిపోయారు. కొందరు తమకు తోచినట్లుగా జేబుల్లో నుంచి కొంత ఖర్చు  చేసి పలువురికి నిత్యావసరాలు అందించారు. అయినప్పటికీ వలస కార్మికులు, దినసరి కూలీల ఆకలి తీరకపోవడంతో ఏంచేయాలో తెలియక దిక్కులు చూస్తున్న పోలీసులకు.. క్యాన్సర్‌తో చనిపోయి అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చిన ఓ వ్యక్తి ఎదురయ్యాడు. ఇంకేముంది పోలీస్‌ స్టేషన్‌నే వంటశాలగా మార్చి చపాతీలు చేయడం  ప్రారంభించారు. డీసీపీ సరోజ్‌ కుమారి నేతృత్వంలో ఎనిమిది మంది బృందంగా ఏర్పడి రుచికరమైన వంటకాలు తయారుచేసి పేదలకు వడ్డించారు. స్థానికులు కొందరు నిత్యావసర వస్తువులు ఇవ్వడం మొదలెట్టడంతో నిత్యం పేదలకు భోజనం పెట్టడం సాధ్యమైందని డీసీపీ సరోజ్‌ కుమార్‌ చెప్పారు. 


logo