e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides టీకాస్త్రం

టీకాస్త్రం

  • వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో 0.07 శాతం మందికే కరోనా
  • 18.51 కోట్ల మందికి టీకా.. 1.43 లక్షల మందిలోనే వైరస్‌
  • టీకాలతో మహమ్మారికి సమర్థంగా అడ్డుకట్ట
టీకాస్త్రం

న్యూఢిల్లీ, మే 18: కరోనా కట్టడికి టీకాలు సంజీవనిలా పనిచేస్తున్నట్టు మరోసారి రుజువైంది. వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్న తర్వాత కొవిడ్‌ సోకిన వారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉన్నట్టు గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 18.51 కోట్ల డోసులు వేయగా.. ఇందులో 1,43,112 మంది (0.07 శాతం) మాత్రమే కొవిడ్‌బారిన పడ్డారు. కరోనా కట్టడిలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే, కొవాగ్జిన్‌ టీకా రెండు డోసులు వేసుకున్న వారిలో 0.13 శాతం మందికి, కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు వేసుకున్న వారిలో 0.07 శాతం మందికి మాత్రమే కరోనా సోకినట్టు వెల్లడైంది. కాగా, టీకా వేసుకున్న వారికి కరోనా సోకే అవకాశాలు 20 శాతం కంటే తక్కువేనని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే, టీకా వేసుకున్న వారి నుంచి వైరస్‌ వ్యాప్తి కూడా చాలా తక్కువగా జరుగుతున్నదని, ఈ విధంగా మహమ్మారి కట్టడికి టీకా గొప్ప ఆయుధమని అంతర్జాతీయ వైద్య నిపుణులు, మెడికల్‌ జర్నల్స్‌ చెబుతున్న విషయం తెలిసిందే.

టీకా పేరు: కొవిషీల్డ్‌

  • ఉత్పత్తి సంస్థ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా
  • ఇప్పటివరకూ వేసిన డోసులు: 16,47,64,399
  • మొదటి డోసు వేసుకున్నాక కొవిడ్‌ సోకినవారు: 84,198
  • రెండో డోసు వేసుకున్నాక కొవిడ్‌ సోకినవారు: 34,874
  • మొత్తంగా టీకా వేసుకున్నాక కొవిడ్‌ సోకినవారు:
  • 1,19,172 (0.07 శాతం)
  • రెండు డోసుల మధ్య వ్యవధి: 12-16 వారాలు

టీకా పేరు: కొవాగ్జిన్‌

  • ఉత్పత్తి సంస్థ: భారత్‌ బయోటెక్‌
  • ఇప్పటివరకూ వేసిన డోసులు: 1,90,90,274
  • మొదటి డోసు వేసుకున్నాక కొవిడ్‌ సోకినవారు: 18,427
  • రెండో డోసు వేసుకున్నాక కొవిడ్‌ సోకినవారు: 5,513
  • మొత్తంగా టీకా వేసుకున్నాక కొవిడ్‌ సోకినవారు: 23,940 (0.13 శాతం)
  • రెండు డోసుల మధ్య వ్యవధి: కనీసం 28 రోజులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీకాస్త్రం

ట్రెండింగ్‌

Advertisement