ఓటీపీ ఆధారంగా సులభంగా స్లాట్ బుకింగ్: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కొవిడ్ వ్యాక్సిన్ స్లాట్ల బుకింగ్‌కు ఇప్పుడు మరో సులభమైన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా టీకా స్లాట్ల బుకింగ్‌ను ప్రారంభించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. ఇందుకోసం మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ నంబర్ ‘9013151515’కు ‘బుక్ స్లాట్’ అనే వాట్సాప్ సందేశాన్ని పంపాల్సి ఉంటుందని ఆయన వివరించారు.