శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 01:52:17

సంజీవని టీకాలు

సంజీవని టీకాలు

కరోనాపై పోరులో ముందడుగు వేశాం: హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: కరోనాపై విజయం సాధించటంలో భారత్‌ కీలక దశకు చేరుకొన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ మహమ్మారిపై పోరాటంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సంజీవనిగా మారాయని తెలిపారు. ‘మనం ఇప్పటికే పోలియోను జయించాం. ఇప్పుడు కరోనాపై విజయం సాధించే కీలక దశకు చేరుకొన్నాం’ అని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖానలో మనీశ్‌ అనే పారిశుద్ధ్య కార్మికుడికి మొదటి టీకా వేసే ప్రక్రియను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలపై తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించారు.  

VIDEOS

logo