మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 02:43:10

అక్టోబర్‌-నవంబర్‌కు వ్యాక్సిన్‌

అక్టోబర్‌-నవంబర్‌కు వ్యాక్సిన్‌

  • సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో పూనావాలా ఆశాభావం

భువనేశ్వర్‌: అక్టోబర్‌-నవంబర్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం కావొచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌ పూనావాలా విశ్వాసం వ్యక్తంచేశారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ తొలి దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన సీఎంకు తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ తదుపరి ట్రయల్స్‌ను ఆగస్టు మధ్యలో నిర్వహిస్తామని, అక్టోబర్‌-నవంబర్‌ నాటికి టీకా సిద్ధం కావొచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో ఎస్‌ఐఐ జట్టుకట్టడంపై నవీన్‌ పట్నాయక్‌ సంతోషం వ్యక్తం చేశారు. టీకా సిద్ధమైన అనంతరం ఒడిశాకు ప్రాధాన్యమివ్వడంలో సహకరించాలని పూనావాలను కోరారు. అస్ర్తాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ మూడో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.


logo