మంగళవారం 02 మార్చి 2021
National - Jan 19, 2021 , 22:56:39

ఆరు దేశాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తాం: మోదీ సంకేతాలు

ఆరు దేశాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తాం: మోదీ సంకేతాలు

న్యూఢిల్లీ: క‌రోనాను నియంత్రించ‌డానికి ‌దేశ‌వ్యాప్తంగా భారీస్థాయిలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఆరు దేశాల‌కు కొవిడ్‌-19 వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని విదేశాంగ‌శాఖ మంగ‌ళ‌వారం తెలిపింది. భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మ‌య‌న్మార్‌, షీషెల్స్ త‌దిత‌ర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వాగ‌తించారు. 

ప్ర‌పంచ మాన‌వాళి ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌రాల‌ను గౌర‌విస్తూ..  విశ్వ‌స‌నీయ భాగ‌స్వామ్య దేశంగా భార‌త్ ప‌లు దేశాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని మోదీ వెల్ల‌డించారు. కొన్ని రోజుల్లోనే ఆయా దేశాల‌కు కొవిడ్‌-19 వ్యాక్సిన్ పంపుతామ‌ని తెలిపారు. పొరుగుదేశాల‌తోపాటు కీల‌క భాగ‌స్వామ్య దేశాల నుంచి భార‌త్‌లో ఉత్ప‌త్తి చేసిన వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేయాల‌ని త‌మ‌కు విజ్ఞ‌ప్తులు అందాయ‌ని తెలిపారు. 

వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా కోసం శ్రీ‌లంక‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, మారిష‌స్ త‌దిత‌ర దేశాలు ఆయా దేశాల్లో నియంత్ర‌ణ సంస్థ‌ల ఆమోదం కోసం వేచి చూస్తున్నాయ‌ని విదేశాంగ‌శాఖ వెల్ల‌డించింది. ఇంత‌కుముందు సోమ‌వారం భూటాన్ ప్ర‌ధాని లోటే షెరింగ్ స్పందిస్తూ.. ఉచితంగానే త‌మ‌కు భార‌త్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామ‌ని హామీ ఇచ్చింద‌ని ప్ర‌క‌టించారు. మ‌రో పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు 20 లక్ష‌ల వ్యాక్సిన్ల‌ను గిఫ్ట్ రూపంలో భార‌త్ అంద‌జేయ‌నున్న‌ది. ఈ నెల 8న భార‌త్ నుంచి మూడు కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయాల‌న్న నిర్ణ‌యానికి బంగ్లాదేశ్ ఆమోదం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo