సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 20:23:32

యూపీలో కొత్త‌గా 3,578 క‌రోనా పాజిటివ్ కేసులు

యూపీలో కొత్త‌గా 3,578 క‌రోనా పాజిటివ్ కేసులు

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా 3,578 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. అలాగే సోమ‌వారం 1,192 మంది ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 42,833 వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 24 గంటల్లో 31 మంది వైర‌స్ ప్ర‌భావంతో మృతి చెంద‌గా, మొత్తం చ‌నిపోయిన వారి సంఖ్య 1,456కు చేరింది. ప్ర‌స్తుతం 26,204 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఆదివారం ఒకే రోజు కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు ల‌క్ష‌కుపైగా చేసిన‌ట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ హెల్త్ సెక్రెట‌రీ అమిత్ మోహ‌న్ ప్ర‌సాద్ తెలిపారు. సోమ‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆదివారం యూపీ వ్యాప్తంగా 1,06,962 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని, దేశంలో ఎక్క‌డా ఇంత మొత్తంలో టెస్టులు చేయ‌లేద‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 19,14,259 న‌మూనాల‌ను ప‌రిశీలించిన‌ట్లు చెప్పారు. శ‌నివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ రాష్ట్రంలో కొవిడ్‌-19 టెస్టులు పెంచాల‌ని ఆదేశించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo