శుక్రవారం 10 జూలై 2020
National - Jun 30, 2020 , 22:34:23

యూపీ మెడికల్‌ హెల్త్‌ డీజీగా మిథిలేశ్‌ చతుర్వేదికి అదనపు బాధ్యతలు

యూపీ మెడికల్‌ హెల్త్‌ డీజీగా మిథిలేశ్‌ చతుర్వేదికి అదనపు బాధ్యతలు

డెహ్రాడూన్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వైద్య,ఆరోగ్య డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ మిథిలేశ్‌ చతుర్వేదికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వైద్య,ఆరోగ్య డైరెక్టర్‌ జనరల్‌గా పని చేస్తున్న రుకుంకేశ్‌ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో చతుర్వేదికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బద్రీవిశాల్‌ను వారంక్రితం రాష్ట్ర ప్రభుత్వం తొలగించి మిథిలేశ్‌ చతుర్వేదిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులో డాక్టర్‌ చతుర్వేదిని తాత్కాలికంగానే నియమించినట్లు  ఆ రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.


logo