శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 16:42:57

సీఎం ప‌ద‌వికి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి!

సీఎం ప‌ద‌వికి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి!

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్రసింగ్ రావ‌త్ త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్‌ హరీశ్ రావ‌త్ డిమాండ్ చేశారు. ఈ విష‌యంపై మాట్లాడేందుకు తాము గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ కోరామ‌ని, ఈ రోజుగానీ రేపుగానీ, గ‌వ‌ర్న‌ర్ త‌మ‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోతే, సీఎం రాజీనామా డిమాండ్‌తో ఆమె ఇంటి త‌లుపులు త‌ట్టాల్సి వ‌స్తుందని హ‌రీశ్‌రావ‌త్ పేర్కొన్నారు. సీఎం అక్రమార్జ‌న ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ చేత ద‌ర్యాప్తు జ‌రిపించాల‌న్న‌ ఉత్త‌రాఖండ్ హైకోర్టు సూచ‌న‌ల నేప‌థ్యంలో హ‌రీశ్ రావ‌త్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.