సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 12:32:33

ఉత్త‌రాఖండ్‌లో మంచు చిరుత‌ల ప‌రిర‌క్ష‌ణ కేంద్రం!

ఉత్త‌రాఖండ్‌లో మంచు చిరుత‌ల ప‌రిర‌క్ష‌ణ కేంద్రం!

డెహ్రాడూన్ : రాష్ర్టంలో శీతాకాల ప‌ర్యాట‌కాన్నిప్రోత్స‌హించేందుకు ఉత్త‌ర‌ఖాశీలో మంచు చిరుత‌ల ప‌రిర‌క్ష‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ తెలిపారు. అట‌వీశాఖ మంత్రి డా. హ‌ర‌క్ సింగ్ రావ‌త్‌, ఇత‌ర అట‌వీ ఉన్న‌తాధికారుల‌తో సీఎం శ‌నివారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

రాష్ట్రంలోని మంచు చిరుత పులుల సంఖ్యను లెక్కించాలన్నారు. మంచు చిరుతపులులను సంర‌క్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. మంచు చిరుత‌ల‌ను గుర్తించేందుకు సైనికులు, స్థానికుల స‌హ‌కారాన్ని తీసుకోవాల్సిందిగా సూచించారు. మంచు చిరుతపులుల సంర‌క్ష‌ణ కేంద్రం, ఇతర వన్యప్రాణుల సంరక్షణ రాష్ట్రంలో శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని సీఎం చెప్పారు. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాలలో అనేక జాతుల వన్యప్రాణులు ఉన్నాయన్నారు. వీటిని పర్యాటకులను ఆకర్షించే కేంద్రాలుగా మార్చాల‌న్నారు. అదేవిధంగా అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రయత్నాలు అవసర‌మ‌ని పేర్కొన్నారు. 

ఉత్తర కాశి, పిథోర్‌ఘ‌ర్ జిల్లాలో మంచు చిరుత‌లు ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్లు స‌మాచారం అన్నారు. కాగా వాటిని ఇంకా లెక్కించలేదని తెలిపారు. వివిధ అధ్య‌య‌న ఆధారంగా ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం 86 మంచు చిరుతలు ఉన్న‌ట్లు స‌మాచార‌మ‌న్నారు. హిమాలయ ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. ప్రొఫెసర్ అన్నే ఫీన్‌స్ర్టా మంచు చిరుత సంరక్షణ కేంద్రంపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు.logo