మంగళవారం 19 జనవరి 2021
National - Jan 10, 2021 , 20:56:35

రహదారి వెడల్పు కోసం.. 19 కి.మీ. మానవహారం

రహదారి వెడల్పు కోసం.. 19 కి.మీ. మానవహారం

డెహ్రాడూన్‌: రహదారి వెడల్పు కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. 19 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడ్డారు. 70 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సిధ్‌పీత్ కురుద్‌ను నంద్‌ప్రయాగ్ ఘాట్‌తో కలిపే 19 కిలోమీటర్ల పొడవైన రహదారి చాలా ఏండ్లుగా విస్తరణకు నోచుకోలేదు. దీంతో తరచుగా జరిగే ప్రమాదాల్లో స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి వెడల్పు కోసం గ్రామస్తులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా చమోలి జిల్లా కర్నోప్రయాగ్ పరిధిలోని 70 గ్రామ పంచాయతీల నివాసితులు ఆదివారం 19 కిలోమీటర్ల పొడవున మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. మరోవైపు తమ డిమాండ్‌ నెరవేరే వరకు నలుగురు వ్యక్తులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు స్థానిక నేత ఒకరు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.