మంగళవారం 07 జూలై 2020
National - Jun 19, 2020 , 16:56:06

ఆరోగ్యశాఖకు రూ.513కోట్లు విడుదల చేసిన ఉత్తరాఖండ్‌

ఆరోగ్యశాఖకు రూ.513కోట్లు విడుదల చేసిన ఉత్తరాఖండ్‌

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖకు శుక్రవారం రూ.513కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ పరిధిలోని పథకాలకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ప్రకటనలో తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రంలోని మూడంచెల పంచాయతీలకు తొలివిడుతగా గురువారం సుమారు రూ.143 కోట్లు విడుదల చేసింది.

అన్ని జిల్లాపరిషత్‌లకు, ప్రాంతీయ పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు, నగర పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం సూచన మేరకు నెలవారీగా కేటాయించాల్సిన రూ.95కోట్లను సైతం విడుదల చేసినట్లు పేర్కొంది.logo