మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 15:05:01

పెట్రోల్‌, నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరసన

పెట్రోల్‌, నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరసన

డెహ్రాడూన్‌ : ఇంధన, ఆహార వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ శనివారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్‌సింగ్‌ ఆ పార్టీ నాయకులతో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రో, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20రోజులుగా పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయని, డెహ్రాడూన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 76.06కు, డీజీల్‌ ధర 81.06కు, వంటగ్యాస్‌ ధర రూ.613కు చేరిందని పేర్కొన్నారు. దేశరాజధాని ఢిల్లీలోనూ గత వారంరోజులుగా ధరల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైందని ఆరోపించారు. ధరలను నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్‌తోపాటు పలు విపక్ష పార్టీలు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనలకు  పిలుపునిచ్చాయి. గతవారం టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణలోనూ పలు జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండలాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలిపిన సంగతి విధితమే. logo