ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 20:24:52

ఉత్త‌రాఖండ్ పోలీసుల విరాళం రూ.3.11 కోట్లు

ఉత్త‌రాఖండ్ పోలీసుల విరాళం రూ.3.11 కోట్లు

డెహ్రాడూన్‌: కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. దేశంలోనూ క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉన్న‌ది. ఇప్ప‌టికే దాదాపు 55 వేల మంది భార‌త పౌరులు ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. ఈ మాయ‌దారి వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి భారీగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో కేంద్ర‌స్థాయిలో పీఎం కేర్స్ ఫండ్‌కు, రాష్ట్ర‌స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ల‌కు దాత‌లు విరాళాలు అంద‌జేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్త‌రాఖండ్ పోలీసులు కూడా త‌మ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3,11,27,014 భారీ విరాళం ఇచ్చారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రికి చెక్ అంద‌జేశారు.  


logo