శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 22:15:43

జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు

జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు

చమోలీ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని భనేర్‌పానీ, పిపల్‌కోటి ప్రాంతాల్లో ఆదివారం భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్), చమోలీ పరిపాలనా అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రహదారికి ఇరువైపులా వాహనాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు, చిన్నారులకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బిస్కెట్లు పంపిణీ చేశారు. రహదారిపై రాళ్లను తొలగించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం వరకు పని పూర్తికావచ్చని అధికారులు తెలిపారు. ఈ రహదారి గంగోత్రి- ఉత్తరకాశీని కలుపుతుంది. భారీవర్షాలు కురిసినప్పుడు సహజంగా ఇక్కడ రహదారిపై కొండచరియలు విరిగిపడి తరచూ వాహనాలు నిలిచిపోతుంటాయి.
logo