గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 14:48:24

మ‌ద్యం దుకాణాలు, బార్ల‌లో సీసీ కెమెరాలు త‌ప్ప‌నిస‌రి

మ‌ద్యం దుకాణాలు, బార్ల‌లో సీసీ కెమెరాలు త‌ప్ప‌నిస‌రి

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టంలోని మ‌ద్యం దుకాణాలు, బార్లు, హోల్ సేల్ అవుట్‌లేట్స్ వ‌ద్ద ఐపీ అడ్ర‌స్‌ల‌తో నెల రోజుల వ్య‌వ‌ధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ఆ త‌ర్వాత నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని సూచించింది. 2019, ఆగ‌స్టులో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను మ‌ద్యం దుకాణాలు, బార్లు పాటించ‌డం లేద‌ని ఈ ఏడాది జులైలో దాఖలైన ధిక్కార పిటిష‌న్‌ను కోర్టు శుక్ర‌వారం విచారించింది. అనంత‌రం ఈ ఆదేశాల‌ను జారీ చేసింది. 

ఇప్ప‌టికే రాష్ర్టంలోని 553 రిటైల్ అవుట్‌లేట్లు ఉండ‌గా.. అందులో 110 అవుట్‌లేట్ల వ‌ద్ద ఐపీ అడ్ర‌స్‌ల‌తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని కోర్టుకు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం తెలిపింది. సీసీ కెమెరాల నిర్వ‌హ‌ణ‌కు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. 251 బార్ల‌కు గానూ 10 బార్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల‌ను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.  

అయితే 21 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు మ‌ద్యం అమ్మ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో 2018లో ప్ర‌జా ప్ర‌యోజ‌న‌ వ్యాజ్యాన్ని న్యాయ‌వాది డీకే జోషి ఉత్త‌రాఖండ్ హైకోర్టులో దాఖ‌లు చేశారు. ఈ నిబంధ‌న‌ను ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు త‌ప్ప‌నిస‌రిగా బార్లు, మ‌ద్యం దుకాణాల వ‌ద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కోర్టుకు విన్న‌వించారు.