గురువారం 04 మార్చి 2021
National - Jan 23, 2021 , 12:33:10

అదనంగా 2లక్షల వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్‌ వినతి

అదనంగా 2లక్షల వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్‌ వినతి

డెహ్రాడూన్‌ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి అదనంగా రెండు లక్షల డోసులు ఇవ్వాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహాకుంభ మేళాను దృష్టిలో పెట్టుకొని కేందానికి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కొవిడ్‌ కంట్రోల్‌ రూం చీఫ్‌ డాక్టర్‌ అభిషేక్‌ త్రిపాఠి మాట్లాడుతూ కుంభమేళా సందర్భంగా రెండు లక్షల డోసులను ఇవ్వాలని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు వస్తారని, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది టీకాలు వేసేలా చూడాలన్నారు. పోలీసులతో పాటు ఇతర సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉందన్నారు. వచ్చే నెలలో జరిగే కుంభమేళాకు 12 కోట్లకుపైగా జనం వస్తారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 88వేల మంది ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తున్నారు. ఇందులో డెహ్రాడూన్‌కు 22,500 డోసులు, హరిద్వార్‌కు 15వేలు, నైనిటాల్‌కు 9,500, ఉదమ్‌సింగ్‌నగర్‌కు 8,500 మోతాదులను కేటాయించారు. మిగతా తొమ్మిది జిల్లాకు 37వేల డోసులు కేటాయించారు. ఉత్తరాఖండ్‌కు బుధవారం 92,500 కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రాగా.. జనవరి 16 టీకా డ్రైవ్‌ ప్రారంభానికి ముందు 1.13 లక్షల డోసులు వచ్చాయి. 

VIDEOS

logo