శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 22, 2020 , 10:57:55

భక్తులకు కేదార్‌నాథ్‌ ప్రసాదం

భక్తులకు కేదార్‌నాథ్‌ ప్రసాదం

డెహ్రాడూన్‌ : కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులకు కేదార్‌ ప్రసాదం ఆన్‌లైన్‌ ద్వారా అందించనుంది. ఈ మేరకు గత సోమవారం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కార్యక్రమానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భక్తులు www.onlineprasad.comలో రూ.451 చెల్లించి ప్రసాదం తీసుకోవచ్చు. ఆలయాన్ని సందర్శించలేని యాత్రికులకు కేదార్‌నాథ్‌ ఆశీర్వాదాలను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు బుక్‌ చేసుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే భరత్‌సింగ్‌ చౌదరి తెలిపారు. ఈ ఆలయం నుంచి ప్రసాదంతో పాటు చౌలై (స్థానిక మూలిక), ఒక రుద్రాక్ష, బిల్వ వృక్షం నుంచి పత్రం, శివుడికి సమర్పించిన ఒక పత్రం, హవన్ సామగ్రి, ఒక నాణెం, పవిత్ర భస్మం పంపిస్తున్నది. భక్తులు కేవలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి వారి పేరు, చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్ నమోదు చేసుకొని ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని రుద్రప్రయాగ జిల్లా మేజిస్ట్రేట్ వందన సింగ్ తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo