శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 15:14:00

అసెంబ్లీకి ట్రాక్టర్‌లో వచ్చిన ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌

అసెంబ్లీకి ట్రాక్టర్‌లో వచ్చిన ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ ట్రాక్టర్‌లో అసెంబ్లీకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ మేరకు నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాన్ని బుధవారం ఒక్క రోజు మాత్రమే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రీతమ్‌ సింగ్‌ అసెంబ్లీకి ట్రాక్టర్‌లో వచ్చారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ మేరకు తన నిరసన తెలియజేశారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై కొన్ని రాష్ట్రాల రైతులతోపాటు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు గురువారం నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించే కార్యక్రమం కూడా ప్రారంభించనున్నది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి