శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 09:18:16

న‌దిలో కాలుజారిప‌డిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

న‌దిలో కాలుజారిప‌డిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ: ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌కు ప‌లు జిల్లాల్లో న‌దులు, కాలువ‌లు పొంగి పొర్లుతున్నాయి.  దీంతో వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను తెలుసుకోవ‌డానికి వెళ్లిన ధ‌ర్చులా కాంగ్రెస్ ఎమ్మెల్యే హ‌రీష్ ధామి ఓ న‌దిలో కాలుజారిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోని పితోరాగ్రాఫ్ జిల్లాలోని ధ‌ర్చులా ప్రాంతంలో గురువారం సంభ‌వించింది. 

భారీ వ‌ర్షాల‌తో బాధ‌ప‌డుతున్న లుమ్తి, మోరికా గ్రామాల్లో ఎమ్మెల్యే ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను బాగోగుల‌ను తెలుసుకుని తిరుగుప‌యాన‌మ‌య్యారు. మార్గ‌మ‌ధ్యంలో ఓ న‌దిని దాటుటుండ‌గా, నీటి ప్ర‌వాహం ఒక్క‌సారిగా పెరిగిపోయింది. దీంతో ఆయ‌న కాలుజారి అందులో ప‌డ్డారు. కింద‌ప‌డిన ఆయ‌న్ను స‌హాయ‌కులు ర‌క్షించారు. చిన్న‌పాటి గాయాల‌తో క్షేమంగా ఇంటికి చేరారు.    


logo