శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 28, 2020 , 11:37:31

ఎయిమ్స్‌లో చేరిన ఉత్తరాఖండ్‌ సీఎం

ఎయిమ్స్‌లో చేరిన ఉత్తరాఖండ్‌ సీఎం

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌కు ఈ నెల 18న కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కాగా, ఆదివారం ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో డెహ్రాడూన్‌లోని డూన్‌ దవాఖానలో చేరారు. స్కానింగ్‌ చేసిన డాక్టర్లు ఆయన ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ గుర్తించారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీఎంను డూన్‌ దవాఖాన నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. సీఎం త్రివేంద్ర సింగ్‌ సతీమణి, కూతురు కూడా కరోనా బారినపడ్డారు. 

కాగా, ఈనెల 15న యూకే నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వారిలో ఒకరి ద్వారా మరి కొందరికి కూడా కరోనా వ్యాపించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్‌కు తరలించామని చెప్పారు. 


logo