బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 14:59:52

కరోనా పరీక్షల సామర్థ్యం పెంపునకు రూ.11.25కోట్లు

కరోనా పరీక్షల సామర్థ్యం పెంపునకు రూ.11.25కోట్లు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కరోనా పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు రూ.11.25కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ శుక్రవారం ప్రకటించారు. ఇందులో 3.75కోట్లు హల్ద్వాని, దోన్‌, శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్యశాలల కళాశాలకు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండడంతో ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో అత్యవసర సామగ్రి, వైద్య పరికరాలు, యంత్రాలు కొనుగోలు చేసి పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. గత నెల డెహ్రాడూన్‌, హల్ద్వాన్‌, శ్రీనగర్‌ మెడికల్‌ కళాశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మూడు యంత్రాల కొనుగోళ్లకు సీఎం రావత్‌ రూ.11కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.    


logo