సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 10:43:06

ప్ర‌భుత్వ కాలేజీలు, వ‌ర్సిటీల్లో ఉచిత వై-ఫై సేవ‌లు

ప్ర‌భుత్వ కాలేజీలు, వ‌ర్సిటీల్లో ఉచిత వై-ఫై సేవ‌లు

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌భుత్వ కాలేజీలు, యూనివ‌ర్సిటీల్లో ఉచిత వై-ఫై సేవ‌లు ప్రారంభం అయ్యాయి. ఈ హైస్పీడ్‌ వై-ఫై సేవ‌ల‌ను ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ ఆదివారం ప్రారంభించారు. సీఎం తన నియోజకవర్గమైన దోయివాలాలోని ఓ కాలేజీలో ఈ సేవ‌ల‌ను ప్రారంభించాడు. ఈ సంద‌ర్భంగా రావ‌త్ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఉచిత ఇంటర్నెట్‌ను అందించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని రావత్ అన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ విద్యార్థుల విద్యలో పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిజిటల్ ఇండియా పిలుపులో భాగంగా తాము అడుగులు వేస్తున్న‌ట్లు రావత్ పేర్కొన్నారు.