సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 19:53:37

చార్‌ధామ్‌ యాత్ర.. ఇతర రాష్ట్రాల భక్తులకూ అనుమతి

చార్‌ధామ్‌ యాత్ర.. ఇతర రాష్ట్రాల భక్తులకూ అనుమతి

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్తోపాటు ఇతర రాష్ట్రాల భక్తులను చార్‌ధామ్‌యాత్రకు శుక్రవారం దేవస్థానం బోర్డు అనుమతించింది. ఇందుకు భక్తులకు బోర్డు కొన్ని పరిమితులు విధించింది. యాత్రికులు కనీసం 72 గంటల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్న రిపోర్టును చూపాలని దేవస్థాన బోర్డు సీఈఓ రవినాథ్ రామన్ తెలిపారు. బోర్డు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ప్రకారం, యాత్రికులు దేవస్థానం బోర్డు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో గుర్తింపు కార్డుతోపాటు కరోనా నిర్ధారణ పరీక్ష రిపోర్టు అప్‌లోడ్‌ చేయాలి. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గతంలో చార్‌ధామ్‌ యాత్రకు రాష్ట్రంలోని భక్తులకు మాత్రమే అనుమతినిచ్చింది. కంటైన్మెంట్ జోన్లు, క్వారంటైన్ కేంద్రాల నుంచి వచ్చే వారికి అనుమతి ఉండదు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో యాత్ర నిలిచిపోయింది.


logo