బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల వ్యక్తి.. కాలేజీ ప్రిన్సిపాల్‌ను గన్‌తో బెదిరించాడు. ప్రిన్సిపాల్ నుదురుపై గన్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. భగువాలా ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. పొడువైన జుత్తు, వేలి ఉంగరాలతో క్యాంపస్‌లో తిరుగుతున్న విద్యార్థిని ప్రిన్సిపాల్ తిట్టాడు. దీంతో ఆ విద్యార్థి గన్ తీసి ప్రిన్సిపాల్‌ను హెచ్చరించాడు. ప్రిన్సిపల్ చాంబర్‌కు టీచర్లు చేరుకునే లోపు అక్కడ నుంచి అతను పారిపోయాడు. అయితే ఆ వ్యక్తి కాలేజీ స్టూడెంట్ కాదు అని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టినట్లు బిజ్నోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ తెలిపారు.