శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 14:35:24

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి క‌రోనా పాజిటివ్

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి క‌రోనా పాజిటివ్

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, స‌మాజ్ వాదీ పార్టీ లీడ‌ర్ రామ్ గోవింద్ చౌద‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు యూపీ వైద్యాధికారులు మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. సోమవారం నుంచి చౌద‌రికి జ్వ‌రం, జ‌లుబు మొద‌లైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆయ‌న ల‌క్నోలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డ  నాయ‌కుడి ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అయితే చౌద‌రితో స‌న్నిహితంగా మెలిగిన వారిని, ఆయ‌న ఇటీవ‌ల ఎక్క‌డెక్క‌డ ప‌ర్య‌టించారు అన్న అంశాల‌పై పోలీసులు, అధికారులు దృష్టి సారించారు. 

యూపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 18,322 కాగా, 569 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్య‌ధికంగా గౌత‌మ‌బుద్ధ న‌గ‌ర్ లో 1,516, ఆగ్రాలో 1,144, కాన్పూర్ న‌గ‌ర్ లో 972, ఘ‌జియాబాద్ లో 942, ల‌క్నోలో 842 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.


logo