గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 15:16:23

షాపింగ్‌ మాల్స్‌లో మద్యం.. యూపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

షాపింగ్‌ మాల్స్‌లో మద్యం.. యూపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

లక్నో:  ఉత్తర్‌ప్రదేశ్‌లో  మందుబాబులకు ఇక పండుగే పండుగ!   ఇకపై   వైన్‌ షాపుల్లోనే కాదు షాపింగ్‌ మాల్స్‌లో   కూడా  మందు బాటిల్స్‌ లభించనున్నాయి.   మాల్స్‌లో    అంతర్జాతీయ  ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని  విక్రయించేందుకు లైసెన్స్‌ల కోసం జూలై 27 నుంచి దరఖాస్తు చేసుకోవాలని యూపీ సర్కార్‌ వెల్లడించింది.  దిగుమతి చేసుకున్న మద్యం  ఆగస్టు 25 నుంచి మాల్స్‌లో విక్రయించుకోవచ్చని తెలిపింది. 

షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు సంబంధించి వార్షిక రుసుము రూ.12లక్షలుగా నిర్ణయించామని, దీనిని వ్యక్తి, కంపెనీ, సంస్థ లేదా సొసైటీ తరఫున పొందవచ్చని ఎక్సైజ్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  

మాల్స్‌లో మద్యం విక్రయాలకు కనీసం నెలరోజుల పట్టే అవకాశం ఉంది. ఆగస్టు 20 నుంచి మాల్స్‌లో ఆల్కహాల్‌ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఎయిర్‌కండిషన్డ్‌ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు.  దుకాణాల ప్రాంగణంలో మద్యం సేవించడాన్ని నిషేధించారు. 


logo