బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 17:06:19

చ‌నిపోవాల‌ని వ‌చ్చేవాళ్లు.. ప్రాణాల‌తో ఎలా బ్ర‌తికుంటారు ?

చ‌నిపోవాల‌ని వ‌చ్చేవాళ్లు..  ప్రాణాల‌తో ఎలా బ్ర‌తికుంటారు ?

హైద‌రాబాద్‌:  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అసెంబ్లీలో వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు.  ఎవ‌రైనా చావాల‌ని అనుకుంటే, వాళ్లు ఎలా ప్రాణాలతో ఉంటార‌న్నారు.  సీసీఏ ఆందోళ‌న‌లు ఉద్దేశిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో సీఏఏను వ్య‌తిరేకిస్తూ జ‌రిగిన నిర‌స‌న‌ల్లో.. యూపీలో సుమారు 20 మంది మ‌ర‌ణించారు. ఆ అంశాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తూ.. అగ‌ర్ కోయీ మ‌ర్నే కే లియా ఆ హీ ర‌హా హై తో వో జిందా కాహా సే హో జాయేగా అంటూ వ్యాఖ్యానించారు.  చావు కోరుకుంటూ ఆందోళ‌న‌ల‌కు దిగేవాళ్ల ప్రాణాలు ఎలా నిలుస్తాయ‌న్న ఉద్దేశం వ‌చ్చే విధంగా సీఎం యోగి మాట్లాడారు. పోలీసుల బుల్లెట్ల వ‌ల్ల ఎవ‌రూ చ‌నిపోలేద‌ని,  ఆందోళ‌న‌కారుల బుల్లెట్ల వ‌ల్ల జ‌నం చ‌నిపోయార‌ని అన్నారు.  ప్ర‌జ‌ల్ని షూట్ చేయాల‌న్న ఉద్దేశంతో వీధుల్లోకి వెళ్లే, అప్పుడు ఆ బుల్లెట్ల‌కు అత‌నే చ‌స్తాడు లేదా పోలీసైనా చ‌నిపోతార‌ని అన్నారు.  ఎవ‌రైనా హింస‌కు దిగితే, వారికి అదే విధంగా స‌మాధానం ఇస్తామ‌న్నారు.logo