మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 16:18:07

అయోధ్య రాముడికి యోగి పూజ‌లు.. ప‌నులు ప‌రిశీలించిన యూపీ సీఎం

అయోధ్య రాముడికి యోగి పూజ‌లు.. ప‌నులు ప‌రిశీలించిన యూపీ సీఎం

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఇవాళ అయోధ్య‌లో ప‌ర్య‌టించారు.  అక్క‌డ రాజ‌జ‌న్మ‌భూమిలో ఉన్న శ్రీరాముడికి పూజ‌లు చేశారు. భ‌ర‌త‌, శ‌తృజ్ఞ‌, ల‌క్ష్మ‌ణుల‌కు కూడా సీఎం యోగి పూజ‌లు నిర్వ‌హించారు.  సుప్రీం తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో ఆగ‌స్టు 5వ తేదీన రామాల‌య నిర్మాణం కోసం భూమిపూజ జ‌ర‌గ‌నున్న‌ది. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజ‌రుకానున్నారు.  ఈ నేప‌థ్యంలో సీఎం యోగి ఇవాళ అక్క‌డ జ‌రుగుతున్న ప‌నులు ప‌ర్య‌వేక్షించారు. శంకుస్థాప‌న గురించి శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్‌, స్థానిక అధికారుల‌తో సీఎం యోగి చ‌ర్చించారు.  

హ‌నుమాన్ గ‌ర్హిలో ఉన్న  హ‌నుమంతుడికి కూడా యోగి పూజ‌లు చేశారు. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న‌.. ప్ర‌త్య‌క్షంగా ప‌నులు ప‌ర్య‌వేక్షించారు. రామాల‌యం కోసం తెచ్చిన శిల‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. శంకుస్థాప‌న కోసం అయిదు వెండి ఇటుక‌ల‌ను కూడా తీసుకువ‌చ్చారు.  విశ్వ‌హిందూ ప‌రిష‌త్ త‌యారు చేసిన డిజైన్ ప్ర‌కార‌మే ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు.  logo