ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:17:49

యూపీ బీజేపీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

యూపీ బీజేపీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇవాళ  యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌  మంత్రి కమలా రాణి వరుణ్ (62) కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. తాజాగాఉత్తర్‌ప్రదేశ్‌ బీజేపీ  అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ కరోనా బారినపడ్డారు. హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సింగ్‌కు సూచించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్వయంగా స్వతంత్ర దేవ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

గత కొద్దిరోజులుగా  తనతో కాంటాక్ట్‌ అయిన వారు స్వచ్ఛందంగా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. ప్రతిఒక్కరూ  కొవిడ్‌-19 నిబంధనలను పాటించాలని సూచించారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 90వేలకు  పైకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 1700 మంది చనిపోయారు.logo