గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 01:48:22

యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు

యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు

బదోహి: ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ త్రిపాఠి, మరో ఆరుగురిపై కేసు నమోదైంది. 2017లో వారంతా నెల రోజులపాటు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఓ వితంతు మహిళ (40) ఈ నెల 10న బదోహి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్రిపాఠి మేనల్లుడు సందీప్‌ తివారీ 2016లో తొలుత ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమెను నెల రోజులపాటు ఓ హోటల్‌లో ఉంచి తివారీ, రవీంద్రనాథ్‌, మరో ఐదుగురు లైంగికదాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ రామ్‌ బదాన్‌ సింగ్‌ తెలిపారు. 


logo
>>>>>>