శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 27, 2020 , 09:58:12

జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద అమెరికా మంత్రుల నివాళి

జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద అమెరికా మంత్రుల నివాళి

హైద‌రాబాద్‌:  ఇవాళ ఇన్‌ఫాంట్రీ డే. ఈ నేప‌థ్యంలో త్రివిధ ద‌ళాల అధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణేలు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు.  భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ పొంపియో, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి మార్క్ ఎస్ప‌ర్ కూడా యుద్ధ స్మార‌కం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఇవాళ భార‌త్‌, అమెరికా మ‌ధ్య చ‌రిత్రాత్మ‌క ర‌క్ష‌ణ ఒప్పందం జ‌ర‌గ‌నున్న‌ది.  బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్‌(బీఈసీఏ) డీల్‌పై రెండు దేశాల సంత‌కాలు చేయ‌నున్నాయి.  ఈ ఒప్పందం కింద హై ఎండ్ మిలిట‌రీ టెక్నాల‌జీ, జియోస్పాటియ‌ల్ మ్యాప్స్‌,  సైన్యాల మ‌ధ్య శాటిలైట్ డేటాను షేర్ చేసుకోనున్నారు.  బీఈసీఏ గురించి ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌, అమెరికా ర‌క్ష‌ణ మంత్రి మార్క్ ఎస్ప‌ర్ మ‌ధ్య ఇటీవ‌ల ఫ‌ల‌ప్ర‌ద‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ ఒప్పందం ప్ర‌కార‌మే ఇవాళ రెండు దేశాలు బీఈసీఏపై సంత‌కం చేయ‌నున్నాయి.