సోమవారం 13 జూలై 2020
National - Jun 15, 2020 , 20:09:59

ఉత్తర సముద్రంలో కూలిన అమెరికా విమానం

ఉత్తర సముద్రంలో కూలిన అమెరికా విమానం

అమెరికా వైమానిక దళానికి చెందిన ఓ విమానం ఉత్తర సముద్రంలో కుప్పకూలిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఓ పైలెట్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అతని ఆచూకి మాత్రం లభించలేదని చెప్పారు.

48వ ఫైటర్‌ వింగ్‌కు చెందిన ఎఫ్‌-15సీ ఈగిల్‌ విమానం ఆర్‌ఏఎఫ్‌ లాకెన్‌ హీత్‌లో సాధార శిక్షణలో ఉండగా సోమవారం ఉదయం కుప్పకూలింది.  ఈ ప్రమాద సమాచారాన్ని అందుకున్న యూకే రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది.


logo