శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 13:12:14

భార‌త నేవీకి ఎఫ్‌-18 యుద్ధ విమానాలు

భార‌త నేవీకి ఎఫ్‌-18 యుద్ధ విమానాలు

హైద‌రాబాద్‌: భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఆయుధ బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్న‌ది.  భార‌త నౌకాద‌ళం కోసం ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించేందుకు అమెరికా అంగీక‌రించింది. భార‌తీయ యుద్ధ నౌక‌ల కోసం ఫైట‌ర్ జెట్ల‌ను ఇస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.  అమెరికా నుంచి 57 ఫైట‌ర్ జెట్ల‌ను కొనుగోలు చేసేందుకు కొన్నేళ్ల క్రితం భార‌తీయ నేవీ ఆస‌క్తి చూపించింది.  ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య యుద్ధ‌నౌక కోసం యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం రెండు దేశాల మంత్రుల మ‌ధ్య ప‌లు ర‌క్ష‌ణ ఒప్పందాలు కుదిరిన విష‌యం తెలిసిందే. ఆ ఒప్పందంలో భార‌తీయ నేవీకి ఎఫ్‌-18 విమానాల‌ను ఇచ్చేందుకు అమెరికా ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్లు ఓ వార్త సంస్థ వెల్ల‌డించింది.