గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 17:04:20

వీసా అపాయింట్మెంట్లు ర‌ద్దు చేసిన యూఎస్ కాన్సులేట్‌

వీసా అపాయింట్మెంట్లు ర‌ద్దు చేసిన యూఎస్ కాన్సులేట్‌

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. అమెరికా కాన్సులేట్ వీసా అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి వీసాల కోసం నిర్వ‌హించే ఇంట‌ర్వ్యూల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు యూఎస్ ఎంబ‌సీకి చెందిన వెబ్‌సైట్ పేర్కొన్న‌ది.  కోవిడ్‌19 వ్యాధి మహ‌మ్మారిగా మార‌డంతో..  అమెరికా కాన్సులేట్ ఈ చ‌ర్య‌కు పూనుకున్న‌ది.  ఇమ్మిగ్రాంట్‌, నాన్ ఇమ్మిగ్రాంట్‌ కేట‌గిరీల్లో ద‌ర‌ఖాస్తున్న చేసుకున్న వారికి నిర్వ‌హించాల్సిన అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఆ నోటిఫికేష‌న్‌లో తెలిపారు. అయితే మ‌ళ్లీ కాన్సులేట్ ఆప‌రేష‌న్స్‌ మొద‌లైన త‌ర్వాత‌.. అభ్య‌ర్థులు కొత్త అపాయింట్మెంట్ తీసుకోవ‌చ్చు అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.  


logo