శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 11, 2020 , 18:33:10

కరోనాపై అమెరికా ప్రజల్లో నిర్లక్ష్యం.. నేను భారత్‌లోనే ఉంటా..

కరోనాపై అమెరికా ప్రజల్లో నిర్లక్ష్యం.. నేను భారత్‌లోనే ఉంటా..

తిరువనంతపురం: కరోనాపై అమెరికా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ దేశానికి చెందిన 74 ఏండ్ల జానీ పాల్ పియర్స్ ఆరోపించారు. కరోనా నేపథ్యంలో భారత్‌లో విధించిన లాక్‌డౌన్ వల్ల పర్యాటక వీసాపై వచ్చిన తాను గత ఐదు నెలలుగా కేరళలోని కోచిలో ఉంటున్నట్లు ఆయన చెప్పారు. అమెరికాలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నదని, అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

మరోవైపు కరోనా నియంత్రణకు భారత ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నదని జానీ తెలిపారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలపాటు భారత్‌లో ఉండేందుకు కేరళ హైకోర్టును ఆశ్రయించినట్లు ఆయన చెప్పారు. తన పర్యాటక వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని కోరానన్నారు. దీంతో భారత్‌లో ట్రావెల్ కంపెనీని ఏర్పాటు చేస్తానని, తన కుటుంబం కూడా ఇక్కడకు వస్తుందని ఆశిస్తున్నానని జానీ పాల్ పియర్స్ తెలిపారు.logo