మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 26, 2020 , 18:43:08

రావత్‌ను మోచేతి టచ్‌తో విష్‌ చేసిన అమెరికా రాయబారి

రావత్‌ను మోచేతి టచ్‌తో విష్‌ చేసిన అమెరికా రాయబారి

న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ పలువురు ప్రముఖులను వినూత్నంగా పలకరించారు. కరోనా నేపథ్యంలో షేక్‌ హ్యాండ్‌కు బదులు మోచేతి టచ్‌తో విష్‌ చేశారు. సోమవారం ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశానికి ముందు ఈ ఘటన జరిగింది. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కెన్నెత్ జస్టర్ అక్కడున్న భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్‌, తదితరులతో కరచాలనానికి బదులు మోచేయి టచ్‌తో  పలకరించారు. అనంతరం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పెర్ ఆధ్వర్యలో ఇరు దేశాల రక్షణ శాఖ ప్రతినిధుల సమావేశం జరిగింది. భారత్‌, అమెరికా దేశాల మధ్య ప్రాంతీయ రక్షణ సహకారానికి సంబంధించిన చారిత్రక ‘బీఈసీఏ’ ఒప్పందంపై సంతకాలు మంగళవారం జరుగనున్నట్లు సమాచారం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.