గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 10:59:43

వంద వెంటిలేటర్స్‌ను భారత్‌కు అందజేసిన అమెరికా

వంద వెంటిలేటర్స్‌ను భారత్‌కు అందజేసిన అమెరికా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌కు అండగా ఉంటున్న అమెరికా తన ఉదారతను మరోసారి చాటింది. తొలి విడతగా వంద వెంటిలేటర్స్‌ను మంగళవారం అందజేసింది. భారత్‌లోని అమెరికా రాయబారి కెన్‌ జస్టర్‌ ఢిల్లీలోని భారత రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రతినిధులకు వీటిని అందజేశారు. భారత్‌కు ఉచితంగా వెంటిలేటర్స్‌ను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఎయిడ్‌) నుంచి ఈ నెల 14న తొలి విడతగా వంద వెంటిలేటర్లు ఢిల్లీకి చేరాయి. ఈ అత్యాధునిక వెంటిలేటర్స్‌ను మసాచుసెట్స్‌లోని మెడికల్‌జోల్‌ సంస్థ తయారు చేసింది. మరోవైపు కరోనా నేపథ్యంలో వైద్య సహాయంగా భారత్‌కు ఇప్పటికే రూ.44.72 కోట్ల ఆర్థిక సహాయాన్ని యూఎస్‌ఎయిడ్‌ అందజేసింది. 
logo