ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 01:52:58

మహారాష్ట్ర శాసన మండలికి ఊర్మిళ!

మహారాష్ట్ర శాసన మండలికి ఊర్మిళ!

ముంబై: బాలీవుడ్‌ నటి ఊర్మిళా మతోండ్కర్‌ మహారాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీగా అడుగుపెట్టనున్నట్టు తెలుస్తున్నది. శాసనమండలికి గవర్నర్‌ కోటాలో 12మంది సభ్యులను నామినేట్‌ చేయాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర క్యాబినెట్‌ గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా ఊర్మిళ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. దీనిపై శివసేన పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ను ప్రశ్నించగా.. ఊర్మిళ పేరును సిఫారసు చేసే అంశంపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని సమాధానాన్ని దాటవేశారు.