బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 15:28:01

ఛార్జీలు కాస్తా ఎక్కువే.. ఇష్టముంటేనే ఎక్కండి

ఛార్జీలు కాస్తా ఎక్కువే.. ఇష్టముంటేనే ఎక్కండి

లక్నో: కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ గత 56 రోజులుగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దుకాణాలు కొంచెం రేట్లు పెంచాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, వ్యాపారుల మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌ ఆర్టీసీ కూడా ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకోవాలని తలంచి ట్యాక్సీలను ప్రవేశపెట్టింది. అయితే ఛార్జీలను మాత్రం సామాన్యుడికి అందనంత ఎక్కువగా పెట్టడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. దాంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌తో టైఅప్‌ పెట్టుకొని ట్యాక్సీలు నడిపాయి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నోయిడా, ఘజియాబాద్‌కు ఏకంగా రూ.10,000, రూ.12,000 వసూలు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఢిల్లీ నుంచి నోయిడా, ఘజియాబాద్‌ దూరంగా ఉంటాయా? అంటే అదీకాదు. కేవలం 250 కిలోమీటర్లకే అంత భారీగా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించి మరీ ఇండ్లకు చేరుకొంటున్నారు. అదే యూపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో అయితే సీటుకు రూ.వేయి, ఏసీ బస్సులో అయితే రూ.1,320 వసూలు చేస్తుండటంతో విస్తుపోవడం ప్రయాణికుల వంతవుతున్నది.


logo