గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 16:29:49

విదేశాల నుంచి వచ్చేవారికి యూపీ ఆర్టీసీ చార్జీల మోత

విదేశాల నుంచి వచ్చేవారికి యూపీ ఆర్టీసీ చార్జీల మోత

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణికుల నుంచి వసూళ్లు పెంచుకునే దిశగా కదులుతున్నది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 250 కిలోమీటర్ల లోపు దూరం వరకు ట్యాక్సీ సేవలకు పదివేలు చెల్లించాలని తెలిపింది. మామూలు కారుకైతే రూ.10 వేలు, ఎస్‌యూవీకి రూ.12 వేలు కనీస చార్జీగా నిర్ణయించింది. 250 కిలోమీటర్లు దాటితే అదనపు చార్జీ వసూలు చేస్తారు. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.40, రూ.50 చొప్పున ్దనపు చార్జీ ఉంటుంది. కారు మరీ ఖరీదు అనుకుంటే బస్సులు కూడా ఉన్నాయి. నాన్ ఏసీ బస్సు కనీస చార్జీ రూ.1000, ఏసీ బస్సుకైతే రూ.1320 వసూలు చేస్తున్నారు. వందేభారత్ మిషన్ కింద విదేశాల నుంచి విమానాల్లో తీసుకువస్తున్న ప్రయాణికుల నుంచి ఈ చార్జీలు వసూలు చేయాలని యూపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ శేఖర్ రీజినల్ మేనేజర్లకు రాసిన లేఖలో ఈ చార్జీల వివరాలు తెలియజేశారు. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు ఈ ట్యాక్సీ, బస్సు సర్వీసులను వినియోగించుకోవచ్చనని ఆయన సూచించారు. దూరం పాటించడం కోసం ఒక్కో బస్సులో 26 మందిని మాత్రమే అనుమతిస్తారు. 


logo