ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 12:48:29

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు చేయనున్న యూపీఎస్‌సీ!

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు చేయనున్న యూపీఎస్‌సీ!

న్యూ ఢిల్లీ : కరోనావైరస్ నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్‌సీ) వివిధ పరీక్షల్లో అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించే దిశగా ఆలోచనలు చేస్తోంది. కమిషన్ అధికారులు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కూడా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. నేరుగా ఇంటర్వ్యూల వల్ల కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అభ్యర్థులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసే విధానాని కమిషన్‌ పరిశీలిస్తోంది.

అయితే ఒక అధికారి కథనం ప్రకారం సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు మాత్రం ఆన్‌లైన్‌లో జరుగవని తెలిసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2019 అభ్యర్థుల ఇంటర్వ్యూలు జూలై 20 నుంచి 30 వరకు జరగనున్నాయి.

ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాన్ని కమిషన్ అన్వేషిస్తున్నప్పటికీ, సీఎస్‌ఈ ప్రిలిమ్స్ కోసం ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించే అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలో 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కానుండడంతో ఆన్‌లైన్‌లో నిర్వహించడం కష్టం. ఇలాంటి పరీక్షను ఆన్‌లైన్‌లో బహుళ సెషన్లలో నిర్వహించవచ్చు. అయితే ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుంది. మే నెలలో జరగాల్సిన సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 4కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

యూపీఎస్‌సీ ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లలో ఎంపిక అయిన అధికారులకు ప్రధాన ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. లక్షలాది మంది అభ్యర్థులు సీఎస్‌ఈ యొక్క ప్రాథమిక పరీక్ష రాసినప్పటికీ వారిలో వేలాది మంది మాత్రమే ప్రధాన పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. వారిలో కొన్ని వందల మంది మాత్రమే ఇంటర్వ్యూలో నిర్వహించే ప్రధాన పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తారు.logo