శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 07:02:01

గరిష్ఠ స్థాయికి యూపీఐ చెల్లింపులు

గరిష్ఠ స్థాయికి యూపీఐ చెల్లింపులు

న్యూఢిల్లీ : యూపీఐ(యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా చెల్లింపులు జూన్‌లో గరిష్ఠానికి చేరాయి. గత నెలలో 134 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ దాదాపు రూ.2.62లక్షల కోట్ల వరకు ఉంటుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గుణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

మేలో నమోదైన వాటితో పోలిస్తే జూన్‌లో 8.94శాతం లావాదేవీలు పెరిగాయి. లౌక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏప్రిల్‌లో యూసీఐ చెల్లింపులు99.5 కోట్లు నమోదయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో తిరిగి యూపీఐ లావాదేవీలు పెరిగాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo