e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News క‌రోనా టెస్టుకు కొత్త పెళ్లి కూతురు.. ఆరోగ్య శాఖ అధికారుల‌పై యువ‌త దాడి

క‌రోనా టెస్టుకు కొత్త పెళ్లి కూతురు.. ఆరోగ్య శాఖ అధికారుల‌పై యువ‌త దాడి

క‌రోనా టెస్టుకు కొత్త పెళ్లి కూతురు.. ఆరోగ్య శాఖ అధికారుల‌పై యువ‌త దాడి

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అలీఘ‌ర్ జిల్లాలోని షాహ్ న‌గ‌ర్ సారౌలా గ్రామంలో కోవిడ్ టెస్టులు చేసేందుకు ఆరోగ్య శాఖ అధికారులు వెళ్లారు. ఓ 37 మందికి క‌రోనా ర్యాపిడ్ యాంటిజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం.. ఓ కొత్త పెళ్లి కూతురు వ‌చ్చింది. ఆ న‌వ వ‌ధువు ముఖాన్ని కొంగుతో క‌వ‌ర్ చేసుకుంది. అక్క‌డున్న వారి ముందు ముఖంపై ఉన్న కొంగును తొల‌గించేందుకు సిగ్గుప‌డింది.

ఆ స‌మ‌యంలో ఆరోగ్య‌శాఖ అధికారులు.. అక్క‌డ ఉన్న మ‌గ‌వారిని ఆమెకు కొంత ప్రైవ‌సీ ఇవ్వాల‌ని కోరారు. త‌ల‌పై ఉన్న కొంగును తీసేందుకు నిరాక‌రించ‌డంతో అధికారులు ఆ గ్రామ‌స్తుల్ని వేడుకున్నారు. అయితే ఆ చోటు నుంచి మ‌గ‌వారిని దూరం వెళ్ల‌మ‌ని అడిగినందుకు.. వాళ్లు ఆరోగ్య‌శాఖ అధికారుల‌పై చేయి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్ద‌రు ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా టెస్టుకు కొత్త పెళ్లి కూతురు.. ఆరోగ్య శాఖ అధికారుల‌పై యువ‌త దాడి

ట్రెండింగ్‌

Advertisement