మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 17:36:48

హత్య కేసుల్లో యూపీ అగ్రస్థానం : ప్రియాంకగాంధీ

హత్య కేసుల్లో యూపీ అగ్రస్థానం : ప్రియాంకగాంధీ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట హత్యలు చోటు చేసుకుంటున్నాయని, గడిచిన మూడేళ్లుగా హత్య కేసుల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుందని మంగళవారం ఆమె ఆక్షేపించారు. దేశంలో నమోదువుతున్న హత్య కేసుల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందోనని, నిత్యం రాష్ట్రవ్యాపంగా 12హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

2016-నుంచి 18వరకు రాష్ట్రంలో పిల్లలపై 24శాతం నేరాలు పెరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ ఈ లెక్కలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారే తప్పా ఇంకేమీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో నేరస్తులు స్వేచ్ఛగా సంచరిస్తున్నా అధికారం, శాంతిభద్రతలు వారి ముందు మోకరిల్లుతున్నాయని ఆక్షేపించారు. ప్రభుత్వ అసమర్థతకు అంకితభావంతో పని చేస్తున్న అధికారులు, పోలీసులు ఫలితం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై, మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా రాష్ట్రంలో మహిళలపై నేరాలే జరగడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం సిగ్గు చేటన్నారు. 2016-18 వరకు మహిళపై 21శాతం నేరాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. నేరాల విషయం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని అన్నారు.


logo