బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 18:04:34

ఇద్దరు చిన్నారుల ఔదార్యం..కిడ్డీ బ్యాంకు నగదు విరాళం

ఇద్దరు చిన్నారుల ఔదార్యం..కిడ్డీ బ్యాంకు నగదు విరాళం

బహ్రెయిచ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనాను ఎదుర్కొనే ప్రజలు తమవంతు సాయమందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన ఇద్దరు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న నగదును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేసేందుకు ముందుకొచ్చారు.

యూపీకి చెందిన వ్యాపారవేత్త గౌరవ్‌ అరోరా కుమార్తెలు మేషా అరోరా (6), అలియా అరోరా (10) తమ కిడ్డీ బ్యాంకులో రూ.5 వేలు చొప్పున దాచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ ను తరిమి కొట్టేందుకు చిన్నారులిద్దరూ తమ వంతు సాయంగా..ఈ మొత్తాన్ని పీఎం కేర్స్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయడం ప్రశంసించదగ్గ విషయమని డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌ శంభు కుమార్‌ అన్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo