గురువారం 09 జూలై 2020
National - Jun 18, 2020 , 17:31:11

ఉత్తర్‌ప్రదేశ్‌లో 604 కరోనా కేసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో 604 కరోనా కేసులు

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్నది. రాష్ట్రంలో గురువారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 604 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 15,785 కేసులు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. తాజాగా వైరస్‌ సోకి 23 మంది చనిపోగా, మృతుల సంఖ్య 488కి చేరింది. 9638 మంది కోలుకున్నారని, 5686 మంది చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

నిత్యం 16వేల టెస్టులు చేస్తున్నామని, బుధవారం ఒక్కరోజు 16,546 టెస్టులు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని 72 జిల్లాలకు 1682 మంది వలస వచ్చారని, వారి రక్త నమూనాలు సేకరించి టెస్టులకు పంపగా, నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మందుల దుకాణాలు, దాబాలు, హోం డెలివరీ సర్వీసుల్లో పని చేసే వారికి పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నుంచి కరోనా టెస్టు మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచార అదనపు కార్యదర్శి అవనీష్‌కుమార్‌ తెలిపారు.


logo